షాదీముబాకర్‌, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన MLA డాక్టర్ మెతుకు ఆనంద్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 28, 2020

షాదీముబాకర్‌, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన MLA డాక్టర్ మెతుకు ఆనంద్బంట్వారం మండల కేంద్రం లోని సుధాకర్ గౌడ్ ఫంక్షన్ హాల్ లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికారాబాద్ ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్* గారు హాజరై లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి పథకం ద్వారా నిరుపేద కుటుంబీకులు ఎంతో లబ్ది పొందుతున్నారన్నారు. ఆడబిడ్డల పెండ్లికి సీఎం కేసీఆర్‌ పెద్దన్నగా నిలిచి రూ. 1,00,116 అందజేస్తున్నారన్నారు.

18 సంవత్సరాలు నిండిన తరువాత పెళ్లిచేసుకున్న ఆడపిల్లలకు మాత్రమే కళ్యాణలక్ష్మి వర్తిస్తుంది అని, బాల్యవివహాలు చేసుకుంటే జైలుశిక్ష తప్పదు అని MLA గారు అన్నారు. TRS ప్రభుత్వం ఉన్నంతవరకు కళ్యాణలక్ష్మి పథకం కొనసాగుతుంది అని MLA గారు అన్నారు.

మండలానికి చెందిన 24 మంది లబ్దిదారులకు రూ. 24 లక్షల, 02 వేల, 784 రూపాయలు లబ్ది చేకూరిందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో MLA గారితో పాటు  MPP ప్రభాకర్, ZPTC సంతోష, PACS చైర్మన్ రాంచెందర్ రెడ్డి, MPDO అశోక్ కుమార్, MRO భీమయ్య, PACS వైస్ చైర్మన్ సుధాకర్ గౌడ్, పార్టీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీలు రాములు యాదవ్, వెంకటయ్య, స్థానిక సర్పంచ్ లావణ్య శ్రీనివాస్, ఎంపీటీసీ పద్మ వెంకటేష్, జిల్లా రైతు కోఆర్డినేటర్ బల్వంత్ రెడ్డి, మండల కో-ఆర్డినేటర్ మల్లారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు నర్సింలు, సర్పంచులు నర్సింలు, నరసింహారెడ్డి, బల్వంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ మొగులయ్య, నాయకులు ఖాజా, శరనారెడ్డి, ఆలంపల్లి శ్రీనివాస్, జగన్నాథ్ రెడ్డి, కబీర్ పటేల్, సుదర్శన్ రెడ్డి, పంది వెంకటయ్య, నాగిరెడ్డి, రాజు, వివిధ గ్రామాల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు పాల్గొన్నారు ఇతర నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.