ప్రతి రైతునూ ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాం - MLA డాక్టర్ మెతుకు ఆనంద్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 28, 2020

ప్రతి రైతునూ ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాం - MLA డాక్టర్ మెతుకు ఆనంద్MLA డాక్టర్ మెతుకు ఆనంద్ గారు ఈ రోజు బంట్వారం మండలం లోని తోర్మామిడి గ్రామంలో PACS తరుపున ఏర్పాటు చేసిన యూరియా మరియు ఫెర్టిలైసెర్స్ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ తరువాత వానకాలం-2020 వ్యవసాయ కార్యాచరణ నియంత్రిత వ్యవసాయ విధానంపై గ్రామస్థాయి లో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు MLA గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా MLA గారు మాట్లాడుతూ గ్రామంలోని రైతులు అందరూ ఒకే పంటను సాగు చేయకుండా వేర్వేరు పంటలను పండించాలని అన్నారు. మక్కజొన్నలు ఈ వర్షాకాలంలో పండించవద్దు అని దానివల్ల భూసారం తగ్గుతుంది అని తెలిపారు. పంటలు పండించే రైతులు నష్టపోకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు పంటలు ఎగుమతి చేసే విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వ్యవసాయంలో నూతన మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో MLA గారితో పాటు ADA వినోద్ గారు, MPP ప్రభాకర్, ZPTC సంతోష, PACS చైర్మన్ రాంచెందర్ రెడ్డి, MPDO అశోక్ కుమార్, MRO భీమయ్య, AO సంధ్య, PACS వైస్ చైర్మన్ సుధాకర్ గౌడ్, పార్టీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీలు రాములు యాదవ్, వెంకటయ్య, తుర్మామిడి సర్పంచ్ స్ఫూర్తి మైపాల్ రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి,  జిల్లా రైతు కోఆర్డినేటర్ బల్వంత్ రెడ్డి, మండల కో-ఆర్డినేటర్ మల్లారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు నర్సింలు, సర్పంచులు నర్సింలు, నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ మొగులయ్య, నాయకులు ఖాజా, శరనారెడ్డి, ఆలంపల్లి శ్రీనివాస్, జగన్నాథ్ రెడ్డి, కబీర్ పటేల్, సుదర్శన్ రెడ్డి, పంది వెంకటయ్య, నాగిరెడ్డి, రాజు, వివిధ గ్రామాల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు పాల్గొన్నారు ఇతర నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.