కరోనా దాటికి SBI ఉద్యోగి మృతి .. భయాందోళనలో సహా ఉద్యోగులు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, May 19, 2020

కరోనా దాటికి SBI ఉద్యోగి మృతి .. భయాందోళనలో సహా ఉద్యోగులు


శుభ తెలంగాణ (19,మే ,2020) : కోఠి బ్యాంక్‌స్ట్రీట్‌ ఎస్‌బీఐ లోకల్‌ హెడ్‌ ఆఫీస్‌లోని కమర్షియల్‌ బ్రాంచ్‌లో మెసెంజర్‌గా పనిచేసే ఓ ఉద్యోగి కరోనాతో సోమవారం మృతి చెందాడు. కాచిగూడ నింబోలిఅడ్డా ప్రాంతంలో నివసించే (57) సంవత్సరాల వ్యక్తి ప్రతిరోజు బ్యాంకుకు వచ్చే వినియోగదారులు ఇచ్చే వోచర్లను బ్యాంకు ఉద్యోగులకు అందజేస్తుంటాడు. అతనికి కొంత కాలంగా జ్వరం, దగ్గు వస్తుండటంతో సెలవులో ఉన్నాడు. ఈ నెల 14న బ్యాంకులోని డిస్పెన్సరీకి వెళ్లి మందులు తీసుకున్నాడు.జ్వరం తగ్గకపోవడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకోగా, గాంధీకి రిఫర్‌ చేశారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. దీంతో నింబోలిఅడ్డా కామ్‌ఘర్‌నగర్‌లోని అతని కుటుంబసభ్యులతో పాటు ఎస్‌బీఐ కమర్షియల్‌ బ్యాంక్‌లో పని చేసే 60 మంది ఉద్యోగులను హోం క్వారంటైన్‌ చేశారు. ఉద్యోగుల ఫోన్‌ నంబర్‌లు, ఇంటి అడ్రస్‌లు వైద్య సిబ్బంది సేకరించారు. జ్వరం, దగ్గు వస్తే తమను సంప్రదించాలని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు.

Post Top Ad