కార్మికులకు TSUTF ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అభినందనీయమన్న మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, May 05, 2020

కార్మికులకు TSUTF ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అభినందనీయమన్న మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్


శుభ తెలంగాణ (05,ఏప్రిల్,2020 - వికారాబాద్ జిల్లా ప్రతినిధి) : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నిరాశ్రయులను ఆదుకోవడం అభినందనీయమని మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. మంగళవారం శైలజ థియేటర్ లో పనిచేసే కార్మికులకు TSUTF ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెంకటరత్నం ఆధ్వర్యంలో కొంతమంది ఉపాద్యాయులు, ఇతర రంగాల్లో ఉన్నవారు హెల్పింగ్ హ్యాండ్స్ వేధిక ద్వారా ఆదుకోవడం శుభపరిణామమన్నారు. కరోనా కట్టడికి అన్ని రంగాలు, వర్గాల వారు సహకరిస్తున్నారని అన్నారు. సామాజిక దూరం పాటించడంతో పాటు, మాస్కులు తప్పకుండా ధరించాలని అన్నారు. కరోనాకు మందు లేదని స్వీయ నియంత్రణ పాటించడమే ఏకైక మార్గమని తెలిపారు. ఇంకా కొన్ని రోజులపాటు ఇంట్లోనే ఉండాలని అన్నారు. TSUTF జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం మాట్లాడుతూ మావంతు సహకారంగా నిత్యావసర సరుకులు అందిస్తున్నామని అన్నారు. లాక్ డౌన్ ను కచ్చితంగా పాటిద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad