రెగ్యులర్‌గా 1000కి దగ్గరగా... తెలంగాణలో 15వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 30, 2020

రెగ్యులర్‌గా 1000కి దగ్గరగా... తెలంగాణలో 15వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు...

తెలంగాణలో కొత్తగా 975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఆరుగురు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 15,394కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 253కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.తాజా కేసుల్లోనూ అత్యధికంగా 861 కేసులు జీహెచ్ఎంసీలోనే నమోదవడం గమనార్హం. ఇప్పటివరకూ 5,582 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 9,559 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
తెలంగాణలో కరోనా పరిస్థితులు,నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు కేంద్ర బృందం ఇవాళ తెలంగాణలో పర్యటించింది. కోవిడ్ 19 ఆస్పత్రులైన గాంధీ,టిమ్స్‌లను సందర్శించి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించింది. దోమలగూడలోని ఓ కంటైన్‌మెంట్ ప్రాంతాన్ని కూడా స్వయంగా సందర్శించి పరిశీలించింది. చెస్ట్ ఆస్పత్రిలో కరోనా రోగి మృతికి సంబంధించిన వివరాలను ఆరోగ్యశాఖ కార్యదర్శి అగర్వాల్‌ను అడిగి తెలుసుకుంది.అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సుమారు ఐదు గంటల పాటు కేంద్ర బృందం చర్చించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వైద్య ఆరోగ్య శాఖ అదికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యుల కొరత లేకుండా ఉండేందుకు మరో 4489 మంది వైద్యులను రిక్రూట్ చేసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 17081 పడకలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది.