మహబూబ్‌నగర్‌లో ఫస్ట్‌ రెస్పాండర్‌ 108 ప్రారంభం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 27, 2020

మహబూబ్‌నగర్‌లో ఫస్ట్‌ రెస్పాండర్‌ 108 ప్రారంభం

పట్టణంలోని జిల్లాకేంద్ర దవాఖానలో ఫస్ట్‌ రెస్పాండర్‌ 108ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బైక్‌ అంబులెన్స్‌ మారుమూల గ్రామాలకు కూడా క్షణాల్లో వెళ్లి ప్రథమ చికిత్స అందిస్తోందన్నారు. ద్విచక్రవాహనానికి వెనుక డబ్బాలో అన్ని రకాల వైద్య పరికరాలు ఉంటాయని ఆయన అన్నారు. వైద్య సేవలను అన్నిప్రాంతాలకు విస్తరింపజేయాలనే ఉద్దేశంతోనే ఈ ఫస్ట్‌ రెస్పాండర్‌ 108ను ప్రారంభించినట్లు తెలిపారు. ఎలాంటి వైద్య సాయం అవసరమైనా వెంటనే 108కు కాల్‌ చేయాలని ఆయన సూచించారు. ఆయన వెంట దవాఖాన సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.