10వేలు దాటిన కేసులు మరో ఐదు మరణాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 25, 2020

10వేలు దాటిన కేసులు మరో ఐదు మరణాలు

తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. బుధవారం భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదమయ్యాయి. బుధవారం ఒక్కరోజే 891 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసులో ఇదే అత్యధికం కావడం గమనానర్హం.బుధవారం మొత్తం 4069 నమూనాలు పరీక్షించగా.. 891 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,444కి చేరింది. కొత్తగా 137 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4361కి పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 5858 యాక్టివ్ కేసులు ఉన్నాయి.రాష్ట్రంలో కొత్తగా ఐదు మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 225కు చేరింది. కాగా, తాజా కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 719 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్ జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి.