అత్యంత ప్రమాదకర తొలి 10 రాష్ట్రాల్లో తెలంగాణ టాప్: ఏపీ వాటా ఎక్కువే: ఆందోళనగా - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, June 28, 2020

అత్యంత ప్రమాదకర తొలి 10 రాష్ట్రాల్లో తెలంగాణ టాప్: ఏపీ వాటా ఎక్కువే: ఆందోళనగా

తెలంగాణలో కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరంగా మారింది. మొదట్లో తక్కువగా కేసులు నమోదైన ఈ తెలుగు రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. కరోనా పాజిటివ్ కేసుల విషయంలో తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్‌లతో పోటీ పడుతోంది. రోజూ నమోదవుతోన్న పాజిటివ్ కేసులు వందల సంఖ్యల్లోనే ఉంటున్నాయి. తరచూ నాలుగంకెలను కూడా దాటేస్తున్నాయి. మరణాల రేటూ అదే స్థాయిలో ఉంటోంది. రికవరీ శాతం నామమాత్రంగా మారింది. నెలరోజుల్లోనే తెలంగాణ ఈ పరిస్థితికి చేరుకోవడం పట్ల ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.
తెలంగాణ వల్ల అత్యంత ప్రమాదకరంగా మారిన తొలి 10 రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ ప్లేస్‌లో నిలిచింది. కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా దీనికి సంబంధించిన వివరాలను జారీ చేసింది. కరోనా వైరస్ వల్ల అత్యంత దారుణంగా మారిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోన్నట్లు వెల్లడించింది. కిందటి నెల 27వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లో నమోదవుతోన్న రోజువారీ పాజిటివ్ కేసులు, మరణాలు, ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకుంటోన్న పేషెంట్ల వివరాల ఆధారంగా ఓ జాబితాను రూపొందించింది కేంద్ర ప్రభుత్వం.
కిందటి నెల 27వ తేదీ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు అన్ని రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులను అధ్యయనం చేసిన తరువాత ఈ జాబితాను రూపొందించింది. కరోనా వల్ల అత్యంత ప్రమాదకరంగా మారిన తొలి 10 రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోండగా.. తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మిగిలిన స్థానాలను ఆక్రమించాయి. ఈ 10 రాష్ట్రాల్లోనూ కరోనా వల్ల పరిస్థితులు అధ్వాన్నంగా మారినట్లు కేంద్రం పేర్కొంది.