ఈ నెల 13 వరకు రైతుబంధు దరఖాస్తుకు అవకాశం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 10, 2020

ఈ నెల 13 వరకు రైతుబంధు దరఖాస్తుకు అవకాశం

తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. రైతుబంధు కు దరఖాస్తు చేసుకోడానికి వ్యవసాయ శాఖ మరో అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరిలో కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన వారు, ఇంతకుముందే పాస్ పుస్తకాలు ఉండికూడా దరఖాస్తు చేసుకోనివారు, ఈ నెల 13 లోగా దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయశాఖ వెల్లడించింది. దరఖాస్తుతోపాటు భూమి పాస్ బుక్ జిరాక్స్ , ఎమ్మార్వో డిజిటల్ సంతకం చేసిన పేపర్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్(సేవింగ్స్ అకౌంట్) జోడించాలని ప్రకటన విడుదల చేసింది.

Post Top Ad