ఈ నెల 16న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రగతిభవన్‌లో ఉపాధి హామీ పథ కం, వ్యవసాయరంగంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. 16న ఉద యం 11.30 గంటలకు ప్రగతిభవన్‌లో నిర్వహించే ఈ సమావేశానికి మంత్రులు హాజరుకానున్నారు. ఈ సమీక్షకు కలెక్టర్లతోపాటు స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా అటవీ అధికారులు కూడా హాజరుకావాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం ఆదేశాలు జారీచేశారు.
కీలక నిర్ణయాలకు అవకాశం
రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రగతి పథం వైపు నడిపించే ప్రక్రియ వేగవంతమైంది. రైతులకు అధిక లాభాలు వచ్చేలా నియంత్రిత సాగును అమలులోకి తీసుకొచ్చారు. ఇదే సమయంలో పంటలు కోతలప్పుడు కళ్లాలకు ఇబ్బందులు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా రూ.460 కోట్లతో లక్ష కళ్లాలు నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ కళ్లాలను ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. గ్రామీణ కూలీలకు పనితోపాటు రైతులకు కావాల్సిన కళ్లాలు అందుబాటులోకి వస్తాయి. ఈ మేరకు ఇటీవల భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం కూడా ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉపాధి హామీ, వ్యవసాయపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో వ్యవసాయరంగానికి ఊపును తీసుకొచ్చే కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నది.