నాణ్యతలేని కిట్లు,నెగిటివ్ వచ్చినా పాజిటివ్,16 ప్రైవేట్ ల్యాబ్‌ల వల్లే ఈ పరిస్థితి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 27, 2020

నాణ్యతలేని కిట్లు,నెగిటివ్ వచ్చినా పాజిటివ్,16 ప్రైవేట్ ల్యాబ్‌ల వల్లే ఈ పరిస్థితి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే ప్రైవేట్ ల్యాబ్‌లలో చేస్తోన్న పరీక్షలతో గందరగోళం నెలకొందని, కేసులు పెరిగేందుకు దోహదం చేసిందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. నిపుణుల కమిటీ నివేదిక గురించి వివరించింది. కేసులు పెరగడంపై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయగా.. ప్రైవేట్ ల్యాబ్‌లలో పరీక్షల తీరు గురించి కమిటీ అధ్యయనం చేసింది. అయితే అక్కడ వారు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని, అందుకే కేసుల సంఖ్య పెరిగిందని ప్రభుత్వం వెల్లడించింది.రాష్ట్రంలోని ప్రైవేట్ ల్యాబ్‌లకు కూడా ఐసీఎంఆర్ జూన్ 15వ తేదీన అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే వారు ఆర్టీ-పీసీఆర్ పద్దతులు తప్పుగా నిర్వహిస్తున్నారని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షలు చేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు అని, తక్కువ నాణ్యతగల కిట్లను ఉపయోగించడం, శాంపిల్స్ సేకరించే సమయంలో పీపీఈ కిట్లు వాడటం లేదని పేర్కొన్నారు. దీంతోపాటు కొందరికీ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ చెబుతున్నారని వివరించారు. దీంతో కేసులు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు.