రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఆదివారం కరోనా కలకలం సృష్టించింది. ఇక్కడ శిక్షణ పొందుతున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి 180 మందికి పాజిటివ్‌గా అధికారులు గుర్తించారు. ఒక ఐపీఎస్ అధికారి, ముగ్గురు అదనపు డీఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలతో పాటు శిక్షణ ఎస్ఐలు, సిబ్బందికి వైరస్ సోకింది. వైరస్ బారినపడ్డ వారిలో ఎవరికీ లక్షణాలు బయటపడలేదని అధికారులు తెలిపారు. బాధితుల కోసం అకాడమీలోనే ప్రత్యేకంగా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా, అకాడమీలో 1100 మందికిపైగా ఎస్ఐలు, 600 మందికిపైగా కానిస్టేబుళ్లు శిక్షణ పొందుతున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అకాడమీలో కలకలం రేగింది.