ఒక్క రోజే 199 కేసులు, ఐదుగురు మృతి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 01, 2020

ఒక్క రోజే 199 కేసులు, ఐదుగురు మృతి

తెలంగాణలో ఆదివారం ఒక్కరోజులో రికార్డు స్థాయిలో భారీగా కరోనా కేసులను గుర్తించారు. ఆదివారం మొత్తం 199 కరోనా కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. వీటిలో 196 కరోనా కేసులు రాష్ట్రానికి చెందినవి కాగా, మరో 3 కరోనా కేసులు వలసకార్మికులకు చెందినవి ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,698కు చేరుకుంది. అయితే, లోకల్ కేసులు మాత్రం 2264 అని హెల్త్ బులెటిన్‌లో వివరించారు. అయితే, ఆదివారం మరో ఐదుగురు కరోనాతో చనిపోయినట్లుగా పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా మృతుల సంఖ్య 82కు చేరుకుంది.ఆదివారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ కొత్తగా భారీగా కేసులు నమోదుకావడం కలవర పరుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 122, రంగారెడ్డి జిల్లాలో 40, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో 3 కేసుల చొప్పున, మేడ్చల్ జిల్లాలో 10, ఖమ్మంలో 9, సూర్యాపేట, జనగామ, నిర్మల్‌లో ఒక్కొక్కటి చొప్పున, వరంగల్ అర్బన్‌లో 2 కేసుల చొప్పున గుర్తించారు. ఇక నాన్ లోకల్ కేసుల్లో ముగ్గురు వలస కార్మికులకు కరోనా సోకింది.