టెన్త్ ఎగ్జామ్స్ : ప్రతి విద్యార్థికి 2 మాస్కులు, శానిటైజర్​..! - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 01, 2020

టెన్త్ ఎగ్జామ్స్ : ప్రతి విద్యార్థికి 2 మాస్కులు, శానిటైజర్​..!

ప‌ద‌వ త‌ర‌గ‌తి పరీక్షలకు వారం రోజుల ముందే విద్యార్థులు హాస్టళ్లకు చేరుకునేలా చూడాలని, ప్రతి విద్యార్థికి థర్మల్​ స్క్రీనింగ్​ చేసి అబ్జర్వేషన్​లో ఉంచాల‌ని అధికారులను గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ ఆదేశించారు. రోగ నిరోధ‌క శ‌క్తి పెంచే ఆహారాన్ని విద్యార్థుల‌కు ఇవ్వాలని చెప్పారు. ప్రతి స్టూడెంట్​కు రెండు మాస్కులు, ఒక శానిటైజర్​ ఇవ్వాలని ఆదేశించారు. భౌతిక‌​ పాటించేలా చూడాలన్నారు. ప‌ద‌వ త‌ర‌గ‌తి​ పరీక్షల నిర్వహణ, కరోనా కట్టడి చర్యలపై ఆమె శనివారం సంబంధిత అధికారుల‌తో రివ్యూ మీటింగ్ నిర్వ‌హించారు.
విద్యార్థుల‌కు వైరస్​ అటాక్ అవ్వ‌కుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప‌ద‌వ త‌ర‌గ‌తి​ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. గిరిజన శాఖ ఆధ్వర్యంలోని పాఠ‌శాల‌ల్లో 2,949 మంది విద్యార్థులున్నార‌ని, అన్ని జిల్లాల్లో వాళ్ల కోసం 38 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశామని ఆమె వివ‌రించారు. పరీక్షా కేంద్రాలకు గ‌వ‌ర్న‌మెంట్ ఏర్పాటు చేసిన వాహనాల్లో టీచర్లు, సిబ్బంది దగ్గరుండి విద్యార్థుల‌ను తీసుకెళ్లాలని సూచించారు. హాస్టళ్లు, పరీక్షా కేంద్రాల్లో… మాస్కులు, శానిటైజర్లు లేకుండా ఎవరినీ అనుమతించొద్దన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో వ‌ర్క్ చేస్తోన్న‌ పినాకి హెల్త్​ కమాండ్​ సెంటర్​ సేవలను వాడుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.