మేడ్చల్ జిల్లా కాప్రా లో 20లక్షల వ్యయంతో "ఆరోగ్య ఉపకేంద్రం - అంగన్వాడి కేంద్రం... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 02, 2020

మేడ్చల్ జిల్లా కాప్రా లో 20లక్షల వ్యయంతో "ఆరోగ్య ఉపకేంద్రం - అంగన్వాడి కేంద్రం...

శుభ తెలంగాణ  (02, జూన్ , 2020) - మేడ్చల్ జిల్లా :  ఉప్పల్ నియోజకవర్గం లో సోమవారం  కాప్రా మండల్ లోని  గాంధీనగర్ లో 20లక్షల వ్యయంతో "ఆరోగ్య ఉపకేంద్రం - అంగన్వాడి కేంద్రం "కొరకు ఉమ్మడిగా  శాశ్వత పక్కా భవన నిర్మాణానికి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ స్వప్న రెడ్డి భూమిపూజ చేసి శంకుస్థాపన చేయగా అధికారులు, బస్తీవాసులు, గాంధీనగర్ వెల్ఫేర్ మరియు యూత్ అసోసియేషన్ ల సభ్యుల సమక్షం లో నిర్మాణానికి ముగ్గు వేసి పనులు ప్రారంభించారు.  అధికారులు MPHEO వెంకటేశ్వర్లు,ఇంజనీర్  చారి, ANM విజయ,అంగన్ వాడి టీచర్ సీమ,కాంట్రాక్టర్ మస్తాన్  మరియు లోక్ సత్తా నాయకులు బి. శివరామకృష్ణ,సి పి యం నాయకులు కె వెంకట్,  బస్తీ మహిళలు జి మణెమ్మ,  మల్లమ్మ ,పాల్గొనగా TRS నాయకులు-గాంధీనగర్ వెల్ఫేర్ అధ్యక్షులు శ్రీ ఎన్ మహేష్ మాట్లాడుతూ - మా బస్తీలో పక్కా భవనం నిర్మాణం జరగడం సంతోషకరమని మరియు యూత్ అసోసియేషన్ కృషి అభినందనీయమని తెలిపారు.అనంతరం గాంధీనగర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు జి. సత్యనారాయణ మాట్లాడుతూ బస్తీలో చెట్లక్రింద గర్భిణీలకు,  బాలింతలకు, పసిపిల్లలకు చికిత్స జరుగుతుండగా యూత్ అసోసిషియేషన్ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి, సంబంధిత అధికారులకు మరియు పత్రికలకు తెలపగా కలెక్టర్ గారి ఆదేశాలతో 20 లక్షల బడ్జెట్ మంజారవ్వగా స్థలం కోసం మా బస్తీలోని పెద్దలకు,వెల్ఫేర్ అసోసియేషన్ కు తెలపగా కొంత స్థానాన్ని నిర్ణయించి  పనులు ప్రారంభంకావడం, ఇక మా బస్తీ ఆడపడుచులకు పసిపిల్లకు చెట్ల క్రింద చికిత్స తీసుకోకుండా  మరియు ఇరుకైన గదినుండి విశాలమైన గదితో  ఆంగన్ వాడి కూడా నిర్మించడం సంతోకరమని యూత్ అసోసిషియేషన్ వెలికి తెచ్చిన ఈ సమస్యను పరిష్కరించుటకు సహకరించిన యూత్ సభ్యులకు, పత్రికలకు పేరుపేరునా కృతఙ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో TRS నాయకులు ఏరియా కమిటీ సభ్యులు ఎం భిక్షపతి గారు, వెల్ఫేర్ సభ్యులు జి సత్తయ్య, దామోదర చారి, కుమార్, జి కృష్ణ, దశరథ, కృష్ణ,జి. బాలయ్య  మరియు యూత్ అసోసియేషన్ సభ్యులు రాకేష్,ఎన్.శ్రీనివాస్, పద్మారావు,బి సురేష్,ఎన్ బాలకృష్ణ,ప్రసాద్,శ్రీకాంత్, శ్రీనివాస్,శేషయ్య తదితరులు పాల్గొన్నారు.


more photos :