213 మందికి వైరస్, రెండోరోజు రెండొందల పాజిటివ్ కేసులు, నలుగురి మృతి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 17, 2020

213 మందికి వైరస్, రెండోరోజు రెండొందల పాజిటివ్ కేసులు, నలుగురి మృతి..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు డబుల్ సెంచరీ దాటుతోంది. సోమవారం 219 కాగా.. మంగళవారం 213 మందికి వైరస్ సోకింది. వైరస్ సోకి మరో నలుగురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 191కి చేరింది. నిన్న ఆ సంఖ్య 187గా ఉంది. రాష్ట్రంలో వైరస్ సోకిన మొత్తం కేసుల సంఖ్య 5 వేల 406గా ఉంది. 2 వేల 188 మందికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు మంగళవారం 261 మందిని ఇంటికి పంపించగా.. మొత్తం వైరస్ తగ్గిన వారి సంఖ్య 3 వేల 27గా ఉంది.
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. సోమవారం 189 కేసులు నమోదు కాగా.. మంగళవారం 165 మందికి వైరస్ సోకింది. రంగారెడ్డిలో 16, మెదక్‌ 13, కరీంనగర్‌ 6, మేడ్చల్‌లో 3, నిజామాబాద్, సంగారెడ్డిలో 2, ఆసిఫాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరిలో ఒక్కొక్కరికి చొప్పున కరోనా వైరస్ సోకింది.
మరోవైపు ప్రధాని మోడీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ నిర్మూలన కోసం అభిప్రాయం సేకరించారు. బుధవారం కూడా సీఎంలు, లెప్టినెంట్ గవర్నర్లతో వీసీ ఉంటుంది. అందరి అభిప్రాయంతో ముందడుగు వేసే అవకాశం ఉంది.

Post Top Ad