సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా రూ.24 లక్షల విలువ గల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే...... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 24, 2020

సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా రూ.24 లక్షల విలువ గల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే......

శుభ  తెలంగాణ(జూన్ 24)మేడ్చల్ జిల్లా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 52 మంది నిరుపేదలకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్  రూ.24,47,500 విలువ గల చెక్కులను ముఖ్యమంత్రి సహాయనిది పథకం  కింద ప్రభుత్వం ద్వారా మంజూరీ చేయించి పేట్ బషీరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు కూడా కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలను అందించడమే టిఆర్ఎస్ ప్రభుత్వం ధ్యేయమని, ఈ మేరకు 52 మంది పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ నాయకులు చౌడ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.