కృష్ణా జిల్లా వేదాద్రి ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 18, 2020

కృష్ణా జిల్లా వేదాద్రి ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా

కృష్ణా జిల్లా వేదాద్రి ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రటించింది. ఈ పరిహారం ఆంధ్రా ప్రాంత మృతులకు కూడా వర్తిస్తుందని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. వేదాద్రి రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. మంత్రి పువ్వాడ అజయ్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య వివరాలు తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని మంత్రి పువ్వాడను సీఎం ఆదేశించారు. 
నిన్న (బుధవారం) వేదాద్రి వద్ద జరిగిన ట్రాక్టర్‌ ప్రమాదంలో ఖమ్మం, కృష్ణా జిల్లాలకు చెందిన 12 మంది మృతిచెందారు. వారిలో తొమ్మిది మంది ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం, జమలాపురం గ్రామాలకు చెందినవారు కాగా, మరో ముగ్గురు కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందినవారు ఉన్నారు.