3 నుంచి గ్రేటర్‌లో కఠినంగా లాక్‌డౌన్...? 2న మంత్రివర్గ సమావేశం..? పగటిపూట కూడా కర్ఫ్యూ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 30, 2020

3 నుంచి గ్రేటర్‌లో కఠినంగా లాక్‌డౌన్...? 2న మంత్రివర్గ సమావేశం..? పగటిపూట కూడా కర్ఫ్యూ

గ్రేటర్ పరిధిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య డేంజర్ బెల్స్ మోగిస్తోంది. యావరేజీగా 1000 వరకు రికార్డవుతోన్న కేసుల్లో భాగ్యనగరానిదే సింహభాగం. ఈ క్రమంలో సిటీలో మరోసారి లాక్‌డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విషయాన్ని ఇటీవల సీఎం కేసీఆర్ సూచనప్రాయంగా తెలిపారు. జూలై 2వ తేదీన గురువారం మంత్రివర్గ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కాకుండా.. గ్రేటర్ పరిధిలో కఠినంగా లాక్‌డౌన్ విధిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది అని, 15 రోజులు లాక్‌డౌన్ విధించాలని వైద్యారోగ్యశాఖ సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పించింది. దానిని ప్రాతిపదికన తీసుకొని.. జీహెచ్ఎంసీ నిర్బంధంలోకి వెళ్లనుంది.గురువారం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొని.. శుక్రవారం నుంచి లాక్‌డౌన్ అమలు చేయబోతున్నారు. గ్రేటర్ పరిధిలో అత్యంత కఠినంగా అమలు చేస్తారని తెలుస్తోంది. ఇదివరకటీ లాగా రాత్రి పూట కాకుండా, మధ్యాహ్నం కూడా కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. పాలు, కూరగాయాలు, మందుల కోసం కేవలం 2 గంటలే అనుమతి ఇస్తారని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఆ తర్వాత రోడ్డు మీద కనిపించొద్దు అని.. ఆగుపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేసే అవకాశం ఉంది.