జీహెచ్‌ఎంసీలోనే 329 మందికి కరోనా...రాష్ట్రంలో మరో 499 కేసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 20, 2020

జీహెచ్‌ఎంసీలోనే 329 మందికి కరోనా...రాష్ట్రంలో మరో 499 కేసులు

రాష్ట్రంలో కరోనావ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతున్నది. ఏమరపాటుగా ఉన్నవారిని అంటుకుంటూనే ఉన్నది. ముగ్గురు ఐపీఎస్‌లకు సైతం వైరస్‌ సోకినట్టు సమాచారం. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే మరో 499 వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 329, రంగారెడ్డి జిల్లాల్లో 129 రికార్డయ్యాయి. జనగామ 7, మహబూబ్‌నగర్‌ 6, మేడ్చల్‌, మంచిర్యాల, వరంగల్‌ అర్బన్‌, నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో 4 చొప్పున, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 2 చొప్పున, సంగారెడ్డి, జగిత్యాల, కరీంనగర్‌, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో 1 చొప్పున నమోదయ్యాయి. వైరస్‌ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 6,526 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 198 మంది మృతిచెందారు. 3,352 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 2,976 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 50,569 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఒక్కరోజే 2,477 టెస్టులు చేయగా, 499 పాజిటివ్‌ రాగా, 1,978 నెగిటివ్‌గా తేలాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. కరోనా చికిత్స అందించే దవాఖానల్లో ఉన్న పడకల వివరాలను కూడా ప్రకటించింది. మొత్తం 34 దవాఖానల్లో 17,081 పడకలు అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. ఇప్పటివరకు ఇందులో 5.71 శాతం పడకలు మాత్రమే భర్తీ అయ్యాయని, మిగిలినవన్నీ ఖాళీగా ఉన్నాయని వివరించింది.

రంగారెడ్డి జిల్లా దవాఖానలో 33 మందికి

రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లోని ప్రభుత్వ జిల్లా దవాఖానలో శుక్రవారం ఒక్కరోజే 33 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే దవాఖాన సూపరింటెండెంట్‌తోపాటు మరో 14 మంది సిబ్బంది వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా 33 మందికి పాజిటివ్‌ రావడంతో దవాఖానలో అయోమయం నెలకొన్నది. వైరస్‌ ప్రభావం హైదరాబాద్‌లో అధికమవుతున్న తరుణంలో కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో అధికారులు ఐసొలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఐసొలేషన్‌ వార్డులో సేవలందిస్తున్న సూపరింటెండెంట్‌ అనారోగ్యంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో దవాఖానలో ఉన్న సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా, జూన్‌ 16న 10 మంది వైద్యసిబ్బందితోపాటు మరో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు మొత్తం సిబ్బందికి, వారి కుటుంబసభ్యులు 95 మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో 33 మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. మరో 15 మంది ఫలితాలు రావాల్సి ఉన్నది.

40-80 ఏండ్ల మధ్యవారు జాగ్రత్త

కరోనా కారణంగా మరణించినవారిలో 40 నుంచి 80 ఏండ్ల మధ్య వయస్కులే ఎక్కువగా ఉన్నారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం 198 మరణాల్లో 168 (85 శాతం) మంది ఈ వయసువారేనని స్పష్టంచేసింది. వీరు జాగ్రత్తగా ఉండాలని, భౌతికదూరం పాటించాలని, శానిటైజర్లు, మాస్కులు తప్పకుండా వినియోగించాలని సూచించింది. అత్యవసరమైతేనే బయటికి రావాలని పేర్కొన్నది.

ముగ్గురు ఐపీఎస్‌లకు పాజిటివ్‌?

రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్‌లకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు సమాచారం. హైదరబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌లు వైరస్‌ బారినపడినట్టు తెలిసింది. ముగ్గురు అధికారులకు ఇటీవలే పరీక్షలు నిర్వహించగా, కరోనా నిర్ధారణ అయినట్టు సమాచారం. ఆ ముగ్గురు అధికారులు క్వారంటైన్‌లో ఉన్నారని, వారికి ఎలాం టి ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేవని తెలిసింది. హైదరాబాద్‌ ఎస్బీ (స్పెషల్‌ బ్రాంచ్‌) కార్యాలయంలోనూ మరో 18 మంది సిబ్బం ది కూడా వైరస్‌ సోకినట్టు తెలిసింది.

టెస్టులకు నిర్దేశిత ధరే చెల్లించాలి 

  • రోనా పరీక్షలపై ప్రజలకు వైద్యారోగ్యశాఖ విజ్ఞప్తి
హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రైవే ట్‌ ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షలకు ప్రభుత్వం నిర్దేశించిన ధరే చెల్లించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రజలకు విజ్ఞప్తిచేసింది. అధికంగా వసూలుచేస్తే తమ దృష్టి కి తీసుకురావాలని సూచించింది. 104 నంబర్‌కు లేదా idsptelangana@ yahoo.comకు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నది. రాష్ట్రవ్యాప్తంగా ఐసీఎమ్మార్‌ అనుమతిపొందిన 18 ప్రైవేట్‌ ల్యాబ్‌ల వివరాలను శుక్రవారం ప్రకటించింది. ల్యాబ్‌ వద్ద శాంపిళ్లు సేకరించి పరీక్షిస్తే రూ.2,200, ఇంటికి వచ్చి శాంపిళ్లు సేకరిస్తే రూ.2,800 వసూలుచేయాలని వైద్యారోగ్యశాఖ మరోసారి స్పష్టంచేసింది.

కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్‌లు

అపోలో హాస్పిటల్‌, జూబ్లీహిల్స్‌, టెనెం ట్‌ డయాగ్నోసిస్‌, బంజారాహిల్స్‌,. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ల్యాబ్‌ మెడిసిన్‌, స్టార్‌ హాస్పిటల్‌, బంజారాహిల్స్‌, సెల్‌కరెక్ట్‌ డయాగ్నోసిస్‌, విరించి హాస్పిటల్‌, బంజారాహిల్స్‌, మ్యాప్‌ మై జీనోమ్‌ ల్యాబ్‌, మాదాపూర్‌, ఏఐజీ హాస్పిటల్‌, గచ్చిబౌలి, డాక్టర్‌ రెమెడిస్‌ ల్యాబ్‌, పంజాగుట్ట, ల్యూసిడ్‌ మెడిక ల్‌ డయాగ్నోస్టిక్స్‌, ఖార్ఖానా, సికింద్రాబాద్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ల్యాబ్‌ మెడిసిన్‌, యశోద హాస్పిటల్‌, సికింద్రాబాద్‌, కిమ్స్‌ హాస్పిటల్‌, సికింద్రాబాద్‌, విజయ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌, హిమాయత్‌నగర్‌, విమ్తా ల్యాబ్స్‌, చర్లపల్లి, లెప్రా సొసైటీ/బ్లూ పీట ర్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌, చర్లపల్లి, అపోలో హెల్త్‌ అండ్‌ లైఫ్‌ైస్టెల్‌ లిమిటెడ్‌, బోయిన్‌పల్లి,  మెడిసిస్‌ పాథ్‌ల్యా బ్స్‌, బోయిన్‌పల్లి, పాథ్‌కేర్‌ ల్యాబ్‌, మేడ్చ ల్‌, బయాగ్నోసిస్‌ టెక్నాలజీస్‌, మేడ్చల్‌, అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాథాలజీ అండ్‌ ల్యాబ్‌ సైన్సెస్‌, శేరిలింగంపల్లి.