352 పాజిటివ్ కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలోనే 302, ముగ్గురు మృతి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 19, 2020

352 పాజిటివ్ కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలోనే 302, ముగ్గురు మృతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం ఒక్కరోజు 352 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6 వేల 27కి చేరింది. సోమ, మంగళవారాల్లో 200 పైచిలుకు పాజిటివ్ కేసులు రికార్డు కాగా.. గురువారం ఆ సంఖ్య 300 మార్కు దాటడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు చేస్తలేరనే విమర్శలు వస్తోన్న క్రమంలో.. ప్రైవేట్ ల్యాబ్‌లకు కూడా పర్మిషన్ వచ్చింది. దీంతో కరోనా పరీక్షలు సంఖ్య పెరుగుతోంది. దీనికితోడు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది.
వైరస్ సోకి ముగ్గురు చనిపోయారు. దీంతో చనిపోయిన మొత్తం సంఖ్య 195కి చేరింది. గురువారం 230 మంది డిశ్చార్జ్ కాగా.. వైరస్ తగ్గి ఇంటికి చేరిన వారి సంఖ్య 3 వేల 301కి చేరింది. వైరస్‌తో 2 వేల 531 మందికి చికిత్స అందిస్తున్నారని వైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు జీహెచ్ఎంసీలో కరనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 180 పైచిలుకు కేసులు నమోదు కాగా.. గురువారం ఆ సంఖ్య 302కి చేరింది. దీంతో భాగ్యనగర ప్రజలు గుండె గుబేల్ మంటోంది.
రంగారెడ్డిలో 17, మేడ్చల్‌ 10, మంచిర్యాల 4, జనగామ 3, వరంగల్ అర్బన్‌ 3, భూపాలపల్లి 2, మహబూబ్‌నగర్‌ 2, మెదక్‌ 2, నిజామాబాద్‌ 2, సంగారెడ్డి 2, వరంగల్ రూరల్‌, నల్గొండ, ఖమ్మంలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదైంది.