ఈనెల 4న కృష్ణా బోర్డు మీటింగ్.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 03, 2020

ఈనెల 4న కృష్ణా బోర్డు మీటింగ్..

కృష్ణా జలాల విషయంలో.. కృష్ణా నీటి యాజమాన్య బోర్డ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలకు ఈనెల 4న జరిగే కృష్ణా నది యజమాన్య బోర్డు మీటింగ్ ఎజెండాలను పంపించింది. ఎజెండాలో ప్రధానంగా 5 అంశాలను ప్రస్తావించారు. వాటిలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు చేపడుతున్న ప్రాజెక్టులు, అభ్యంతరాలు, ప్రాజెక్టుల డీపీఆర్ లు, వచ్చే సంవత్సరానికి సంబంధించిన నీటి పంపకాలు, నీటి వినియోగంకు సంబంధించి టెలిమెట్రిక్ ఏర్పాటు, శ్రీశైలం, నాగార్జున సాగర్ కింద పవర్ వినియోగం, బోర్డుకు సంబంధించిన ఇరు రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించారు.
ఇవి కాకుండా ఇరు రాష్ట్రాలు సూచించే అంశాలను కూడా చర్చకు అంగీకరించనున్నట్లు వెల్లడించారు. అలాగే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో కూడా రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 4న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ జలసౌధ లో కృష్ణా నది యజమాన్య బోర్డు సమావేశం కానుంది.