రామ్ నరేష్ నగర్ కమ్యూనిటీ హాల్ 418 పోలింగ్ బూత్ లొ మొక్కలు నాటే కార్యక్రమం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 24, 2020

రామ్ నరేష్ నగర్ కమ్యూనిటీ హాల్ 418 పోలింగ్ బూత్ లొ మొక్కలు నాటే కార్యక్రమం


శుభ తెలంగాణ (24, జూన్ 2020) : శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా మేడ్చల్ జిల్లాకు సంబంధించి శేరిలింగంపల్లి లోని హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రామ్ నరేష్ నగర్ కమ్యూనిటీ హాల్ 418 పోలింగ్ బూత్ లొ మొక్కలు నాటే కార్యక్రమం శేర్లింగంపల్లి అసెంబ్లీ కో కన్వీనర్ సిహెచ్ వీరయ్య చారి గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారు , మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాధవరం కాంతారావు గారు, విశిష్ట అతిథులుగా రాష్ట్ర నాయకులు గజ్జల యోగానంద గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నరేష్ గారు, రాష్ట్ర నాయకులు మువ్వ సత్యనారాయణ గారు , రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్ గారు, అసెంబ్లీ కన్వీనర్ బుచ్చి రెడ్డి గారు జాతీయ యువ మోర్చా నాయకులు నరేందర్ రెడ్డి గారు , పాల్గొన్నారు. ఈ కార్యక్రమం డివిజన్ అధ్యక్షుడు జొన్నాడ నవీన్ గౌడ్ గారి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర యువ మోర్చానాయకులు అరుణ్ గారు,సీనియర్ నాయకులు వెలగ  శ్రీనివాస్ గారు, డివిజన్అధ్యక్షులు కమలాకర్ రెడ్డి గారు , నర్సింగ్ గారు, భూపాల్ రెడ్డి గారు, మూడు డివిజన్లో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.