కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్లు, నివాస స్థలం, భార్యకు గ్రూప్-1 జాబ్: కేసీఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 20, 2020

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్లు, నివాస స్థలం, భార్యకు గ్రూప్-1 జాబ్: కేసీఆర్

చైనా జవాన్లతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టంచేశారు. సరిహద్దుల్లో శత్రుదేశాల నుంచి దేశాన్ని కాపాడుతోన్న జవాన్లకు యావత్ దేశం అండగా ఉంటుందని, కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి చేసే సాయాన్ని కేసీఆర్ ప్రకటించారు. చైనాతో ఘర్షణకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున పాల్గొన్న కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం అందజేయబోయే సాయాన్ని వివరించారు.
సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల నగదు అందజేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అలాగే నివాస స్థలం, సంతోష్ బాబు భార్యకు గ్రూప్ 1 క్యాడర్ ఉద్యోగం ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. సంతోష్ బాబు ఇంటికెళ్లి మరీ స్వయంగా తానే అందజేస్తాని పేర్కొన్నారు. గాల్వాన్ లోయలో ఘర్షణ జరిగిన మిగతా 19 మంది జవాన్లకు కూడా ఆర్థికసాయం చేస్తామని పేర్కొన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున అందజేస్తామని తెలిపారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర రక్షణశాఖ మంత్రికి అందజేయబోతున్నామన్నారు.సరిహద్దుల్లో దేశం కోసం రక్షణగా ఉంటోన్న సైనికులకు దేశం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. డ్రాగన్‌తో జరిగిన ఘర్షణలో చనిపోయిన సైనికుల కుటుంబాలకు ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం ఉందన్నారు. దేశం మొత్తం మీ వెంటే ఉందనేలా సందేశం ఇవ్వాలని.. వారి కుటుంబాల్లో భరోసా నింపాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వీరమరణం పొందిన జవాన్లకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సాయం చేయాలని కేసీఆర్ సూచించారు. కేంద్రం అందించే సాయంతోపాటు చేయి వస్తే వారికి ఆర్థికంగా భరోసా ఇచ్చినవారమవుతామని తెలిపారు.కరోనా వైరస్ వల్ల రాష్ట్రాలు, కేంద్రం వద్ద నిధులు లేవు అని.. కానీ మిగతా ఖర్చులు తగ్గించుకొని వెచ్చించాలని సూచించారు. సైనికుల సంక్షేమమే తొలి ప్రాధాన్యం అని చేతల్లో చూపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు చేసే పనులతో.. సైనికులు కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నిండుతోందని.. సింబల్ ఆఫ్ యూనిటీ అని అనుకుంటారని పేర్కొన్నారు.