ముస్లిం కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు రూ.5 వేల సాయం అందించాలని వక్ఫ్‌బోర్డు నిర్ణయించింది. చైర్మన్ మహమ్మద్ సలీం అధ్యక్షతన శనివారం సమావేశమైన బోర్డు.. మొత్తం 49 అంశాలపై చర్చించింది. గంధంగూడ గ్రామంలో శ్మశానవాటిక సర్వేనంబర్ 81లో ఓ ముస్లిం మృతదేహాన్ని ఖననం చేయకుండా అడ్డుకున్న వీఆర్ఏ, తాసిల్దార్ కార్యాలయ సిబ్బందిపై క్రిమినల్ కేసు నమోదుచేయాలని కలెక్టర్‌ను కోరింది. శ్మశానవాటికల్లో మృతదేహాల ఖననంపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటుచేయనున్నట్టు పేర్కొన్నది. సమావేశంలో బోర్డు సభ్యులు అక్బర్ నిజాముద్దీన్ హుస్సేన్, మిర్జా అన్వర్‌బేగ్, జాకీర్ హుస్సేన్, జావిద్ పాల్గొన్నారు.
Post Top Ad
Sunday, June 07, 2020
పేద ముస్లిం కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు రూ.5 వేల సాయం
Admin Details
Subha Telangana News