రాష్ట్రంలో కొత్తగా 546 కరోనా పాజిటివ్‌ కేసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, June 21, 2020

రాష్ట్రంలో కొత్తగా 546 కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో శనివారం కొత్తగా 546 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 458, రంగారెడ్డి జిల్లాలో 50 రికార్డయ్యాయి. కరీంనగర్‌ 13, జనగామ 10, మేడ్చల్‌ 6, మహబూబ్‌నగర్‌ 3, ఖమ్మం, వరంగల్‌ రూరల్‌ 2 చొప్పున, వరంగల్‌ అర్బన్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున ఉన్నాయి. వైరస్‌ కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 7,072 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 203 మంది మరణించారు. మొత్తం 53,757 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఇందులో 46,685 మందికి నెగెటివ్‌ అని తేలింది. శనివారం 3,188 పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు చికిత్స అనంతరం 3,506 మంది డిశ్చార్జి అయినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.