తెలంగాణకు చేరిన కరోనా మందు.. మరో 5 రాష్ట్రాలకు కూడా - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 25, 2020

తెలంగాణకు చేరిన కరోనా మందు.. మరో 5 రాష్ట్రాలకు కూడా

కరోనా రోగుల చికిత్సలో ఉపయోగించనున్న మందు ‘కొవిఫర్‌’ను తొలి విడతలో భాగంగా ఐదు రాష్ట్రాలకు అందించారు. వీటిలో తెలంగాణ రాష్ట్రం కూడా ఉండడం విశేషం. దేశంలో అత్యధికంగా కరోనా వైరస్‌ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు ఈ ఔషధాన్ని పంపారు. తర్వాత బ్యాచ్‌ కరోనా ఔషధాన్ని కోల్‌కతా, ఇండోర్‌, భోపాల్‌, లక్నో, పాట్నా, భువనేశ్వర్‌, రాంచీ, విజయవాడ, కోచి, తిరువనంతపురం, గోవాకు సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది.
అమెరికాకు చెందిన గిలిద్‌ సైన్సెస్‌ అనే సంస్థ రెమ్‌డెసివర్ అనే మందును అభివృద్ధి చేసింది. అయితే, ఈ జనరిక్‌ తయారుచేసి, పంపిణీ చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన హెటిరో ల్యాబ్స్‌కు అనుమతి లభించింది. ఈ క్రమంలో హెటిరో తొలివిడతగా 20 వేల వయల్స్‌ను తయారు చేసి, ఆయా రాష్ట్రాలకు అందించింది. మరో రెండు లేదా మూడు వారాల్లో లక్ష వయల్స్‌ తయారు చేయాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.