ఒకేరోజు 6 మరణాలు.. కొత్తగా 178 కేసులు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 10, 2020

ఒకేరోజు 6 మరణాలు.. కొత్తగా 178 కేసులు..

లాక్ డౌన్ సడలింపుల తర్వాత తెలంగాణలో కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాపిస్తూ ప్రజల్ని బలితీసుకుంటున్నది. మంగళవారం రాత్రి ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో మరో ఆరుగురు చనిపోయారు. దాంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 148కి చేరింది. అంతేకాదు, కొత్త కేసుల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరిగింది. మరోవైపు గాంధీ ఆస్పత్రిలో మరోసారి వైద్యులపై దాడి జరగడం ఉద్రిక్తతకు దారితీసింది.
సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం దాకా నిర్వహించిన టెస్టుల్లో కొత్తగా 178 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వీరంతా లోకల్ వ్యక్తులే కావడం గమనార్హం. కొత్తవాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,920కి పెరిగింది. ఇందులో కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకుని ఇప్పటికే 1,742 మంది డిశ్చార్జికాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 2,030గా కొనసాగుతున్నది. మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.