మూడు చెక్ డ్యాంల నిర్మాణానికి రూ.9.11 కోట్లు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 05, 2020

మూడు చెక్ డ్యాంల నిర్మాణానికి రూ.9.11 కోట్లు

బొంరాస్‌పేటమండలంలోని కాగ్నా వాగు పరీవాహక ప్రాంతంలో మూడు చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం రూ.9.11కోట్లు మంజూరు చేసిందని టీ ఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి తెలిపా రు. మండలంలోని మహంతీపూర్‌ గ్రామానికి సమీ పంలో నిర్మించే చెక్‌డ్యాం నిర్మాణ స్థలాన్ని  నీటిపారుదల శాఖ డీఈ కిరణ్‌కుమార్‌ తో కలిసి పరిశీలించారు. తుంకిమెట్ల పరిధిలోని ర్మించే చెక్‌డ్యాంకు రూ.3.14కోట్లు, బొంరాస్‌ పేట పరిధిలో నిర్మించే చెక్‌డ్యాంకు రూ.2.69కోట్లు, మ హంతీపూర్‌లో నిర్మించే చెక్‌డ్యాంకు రూ. 3. 28 కోట్లు మంజూరయ్యాయని యాదగిరి తెలిపారు. 
రేపు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పర్యటన
కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి శుక్రవా రం మండలంలో పర్యటిస్తున్నట్లు యాదగిరి తెలిపారు. మహంతీపూర్‌ గ్రామ సమీపంలో నిర్మించే చెక్‌డ్యాంకు ఎమ్మెల్యే  భూమి పూజ చేస్తారని అనంతరం బొంరాస్‌పేటలో మహిళా సంఘాలకు కొవిడ్‌ రుణాల పంపిణీ, వడిచెర్లలో పారిశుద్ధ్య కార్యక్రమం లో ఎమ్మెల్యే పాల్గొంటారని ఆయన తెలిపారు.