అధిక విద్యుత్ బిల్లుల వసూళ్లకు నిరసనగా ఈరోజు జీడిమెట్ల AEఆఫీసు నందు రాష్ట్ర బిజెపి కౌన్సిల్ సభ్యులు లక్ష్మీపతి రాజు ఆధ్వర్యంలో నిరసన - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 15, 2020

అధిక విద్యుత్ బిల్లుల వసూళ్లకు నిరసనగా ఈరోజు జీడిమెట్ల AEఆఫీసు నందు రాష్ట్ర బిజెపి కౌన్సిల్ సభ్యులు లక్ష్మీపతి రాజు ఆధ్వర్యంలో నిరసన


కుత్బుల్లాపూర్ జూన్ 15 (శుభ తెలంగాణ) : రాష్ట్రా పార్టి ఆదేశం, జిల్లా నాయకుల సూచన మేరకు ప్రజలకు వస్తున్న అధిక విద్యుత్ బిల్లుల వసూళ్లకు నిరసనగా ఈ రోజు జీడిమెట్ల AE ఆఫీస్ నందు రాష్ట్రా బీజేపి కౌన్సిల్ సభ్యులు లక్ష్మి పతి రాజు ఆద్వర్యంలో నిరసన, ధర్నా చేయటం జరిగింది. ఈ కరోనా తో ప్రజలు ఇబ్బంది పడుతు ఉంటే ప్రభుత్వం ప్రజల పై విద్యుత్ భారం వేయటం సరికాదు అని AE కి వివరించటం జరిగింది. నిరసనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదం చేయడం, ప్రజలు ఇబ్బంది లో ఉన్నారు కావున వెంటనే బిల్లులు ఉపసంహ రించు కోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షులు కంది శ్రీరాములు , హనుమాన్ కచువా, bjym నాయకులు అనిల్ గౌడ్, డివిజన్ సభ్యులు భీమరాజు, ఏపురి శ్రీనివాస్, రవి కుమార్ గుప్తా, 129 డివిజన్ సభ్యులు సాయి రెడ్డి, BC మోర్చా నాయకులు భిక్షపతి, ప్రదీప్ శర్మ తదితర బీజేపి కార్యకర్తలు పాల్గొన్నారు.