నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 01, 2020

నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

నగరంలోని పలు ప్రాంతాలతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్, హయత్ నగర్, నాగోల్, బీఎన్ రెడ్డి నగర్, మీర్ పేట్, హస్తినాపురంలో దాదాపు గంటపాటు భారీ వర్షం కురిసింది.
ఉప్పల్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ ,పంజాగుట్ట, ఈసీఐఎల్, నాచారం, ఇబ్రహీంపట్నం, దిల్‌సుఖ్‌నగర్, సంతోష్ నగర్, మలక్ పేట్, అప్ఝల్‌గంజ్, మెహిదీపట్నం, లక్డీకపూల్, కోటి, నారాయణగూడ, అంబర్ పేట, రాంనగర్,సోమాజిగూడ, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలీ ప్రాంతంలో కూడా కుండపోత వర్షం పడింది.
అబ్దుల్లాపూర్ మెట్, ఇబ్రహీంపట్నం, యాచారం, సంతోష్ నగర్, బడంగ్ పేట్,బాలాపూర్ ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు వర్షం కురిసింది. నగరంలో భారీ వర్షం కురియడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.

Post Top Ad