మిడతల దండు రాకపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 11, 2020

మిడతల దండు రాకపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

దేశంలో కరోనా మహమ్మారితోపాటు మిడతల సమస్య కూడా రాష్ట్రాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో పంటలను నాశనం చేసిన ఈ మిడతల దండు దక్షిణ భారతదేశంవైపు, ముఖ్యంగా తెలంగాణకు దగ్గరి వరకు చేరుకున్నాయనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది.
ఈ క్రమంలో మిడతల దండు రాకపై ముఖ్యమంత్రి కేసీఆర్.. సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి మిడతల దండు నుంచి ప్రమాదం పొంచివున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
గత నెలలో 3 దఫాలుగా వచ్చిన మిడతలు మహారాస్ట్ర, మధ్యప్రదేశ్‌కే వచ్చాయన్నారు. తాజాగా మిడతల దండు రాష్ట్రానికి 200 కి.మీల దూరంలో ఉందని తెలిపారు. దక్షిణంవైపు ప్రయాణిస్తే తక్కువ సమయంలోనే మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని, అదే జరిగితే ఏ క్షణంలోనైనా తెలంగాణ పంటలకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు. జూన్ 20-జులై 5 వరకు మిడతల దండు రాష్ట్రంలోకి వచ్చే ప్రమాదం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో సోమేశ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే పంటలు పూర్తిగా నాశనం అవుతాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మిడతల దండు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Post Top Ad