జీహెచ్ఎంసీ మేయర్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్, హోం క్వారంటైన్‌లోకి బొంతు అండ్ ఫ్యామిలీ.. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 12, 2020

జీహెచ్ఎంసీ మేయర్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్, హోం క్వారంటైన్‌లోకి బొంతు అండ్ ఫ్యామిలీ..

కరోనాకు చిన్న, పెద్ద.. పేద, ధనిక అనే భేదం లేదు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌కి పాజిటివ్ వచ్చింది. దీంతో బల్దియా సిబ్బంది, రామ్మోహన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉలిక్కిపడ్డారు. మేయర్ డ్రైవర్‌కు నిర్వహించిన కరోనా వైరస్ ఫలితాలు గురువారం వచ్చాయి. పాజిటివ్ అని రావడంతో మేయర్ బొంతు రామ్మోహన్ అండ్ ఫ్యామిలీ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయింది.
మేయర్ కారు డ్రైవర్ ఇవాళ బొంతు రామ్మోహన్‌తో ఉన్నాడు. దీంతో అతను ఇంకా ఎవరితో కలిశాడు అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. శుక్రవారం మేయర్ బొంతు రామ్మోహన్ అండ్ ఫ్యామిలీకి కరోనా వైరస్ పరీక్షలు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవల మేయర్ కరోనావైరస్ పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు ఊపిరి పీల్చుకున్న సిబ్బంది.. ఇప్పుడు ఆయన డ్రైవర్‌కు వైరస్ సోకడంతో ఆందోళన చెందుతున్నారు.
స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌లో భాగంగా నాలుగురోజుల క్రితం మేయర్ హోటల్‌కి వెళ్లారు. అక్కడ టీ ఇవ్వడంతో తాగారు. అయితే దుకాణంలో పనిచేసే మాస్టర్‌కు కరోనా వైరస్ వచ్చినట్టు తెలిసింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. అప్పుడు నెగిటివ్ రావడంతో హమ్మయ్యా అంటూ రిలాక్స్ అయ్యారు. కానీ డ్రైవర్‌కు కరోనా వైరస్ రావడం.. ఇవాళ కూడా ఆయనతో తిరగడంతో ఆందోళన నెలకొంది. శుక్రవారం రామ్మోహన్ రక్త నమూనాలను ఇస్తే.. ఆదివారం ఫలితం వచ్చే అవకాశం ఉంది.

Post Top Ad