హైదరాబాద్‌లో మల్టీ విటమిన్ టాబ్లెట్ల కొరత, ప్రిస్కిప్షన్ ఉంటేనే మెడిసిన్, విటమిన్ సీ, డీ.. - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 29, 2020

హైదరాబాద్‌లో మల్టీ విటమిన్ టాబ్లెట్ల కొరత, ప్రిస్కిప్షన్ ఉంటేనే మెడిసిన్, విటమిన్ సీ, డీ..

కరోనా వైరస్ కేసుల గణనీయంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ మహానగరం గురించి అయితే చెప్పక్కర్లేదు. పదుల సంఖ్య నుంచి వందలు, వేల వరకు పాజిటివ్ కేసులు వచ్చాయి. అయితే వైరస్ తగ్గి డిశ్చార్జ్ అయిన వారు.. కరోనా లక్షణాలు కనిపించినవారు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వాడుతున్నారు. దీంతో హైదరాబాద్ మహానగర మెడికల్ షాపుల్లో మల్టీ విటమన్ మాత్రల కొరత ఏర్పడింది. ముఖ్యంగా సీ, డీ విటమిన్ టాబ్లెట్లు కావాలని అడిగితే లేవు అని మందుల షాపు ఓనర్లు నిర్మొహమాటంగా చెబుతున్నారు.అపోలో ఫార్మాసీ సహా పలు ప్రధాన మెడికల్ షాపుల్లో టాబ్లెట్స్ దొరకడం లేదు. మల్టీ విటమన్ మాత్రలకు డిమాండ్ గణనీయంగా పెరగడంతో వైద్యుడి ప్రిస్కిప్షన్ కంపల్సరీ అని చెబుతున్నారు. ప్రిస్కిప్షన్ ఉంటేనే మాత్రలు ఇవ్వాలని యజమాన్యం స్పష్టంచేసిందని తెలిపారు. గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా వైరస్ తగ్గి డిశ్చార్జ్ అయినవారు.. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని అనుకుంటున్న వారు రావడంతో మల్టీ విటమన్ మాత్రల కొరత ఏర్పడింది.