హైదరాబాద్ ఆది జాంబవ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 03, 2020

హైదరాబాద్ ఆది జాంబవ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు....

శుభ తెలంగాణ న్యూస్ (03జూన్ 20) హైదరాబాద్ కాప్రా సర్కిల్ లో  గాంధీనగర్ లో ఆది జాంబవ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టి.ఆర్.ఎస్ ఉప్పల్  నియోజకవర్గ ఇంచార్జ్ బండారు లక్ష్మారెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆది జాంబవ వెల్ఫేర్ కార్యనిర్వాహకులు డప్పు బాబు రావు మాట్లాడుతూ...ఉద్యమాల ఊపిరితో పురుడు పోసుకున్న మన తెలంగాణ 6 దశాబ్దాల పోరాట ఫలితం అని కోట్ల మంది ప్రజల ఆకాంక్షగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. ఉద్యమకాలంలో తీవ్రమైన అణిచివేతకు గురయ్యామని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆది జాంబవ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జి కృష్ణయ్య, ఉపాధ్యక్షులు ఏన్.  యాదగిరి, జనరల్ సెక్రెటరీ టి. నర్సింగరావు, సభ్యులు బి.యాదగిరి,జి. కృష్ణ, ఏన్.ప్రవీణ్ కుమార్,జి. ఇంద్రయ్య, గడ్డం. రామ్ చందర్ ,        
 డి.ధర్మేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఆది జాంబవ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు....