పుష్కరిణిలో స్నానాల‌కు అనుమ‌తి లేదు : మంత్రి అల్లోల - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 05, 2020

పుష్కరిణిలో స్నానాల‌కు అనుమ‌తి లేదు : మంత్రి అల్లోల

కేంద్ర‌, రాష్ట్ర  ప్రభుత్వ సూచనలు, ఆదేశాల మేరకు జూన్ 8 నుంచి  తెలంగాణ‌లోని ఆలయాల్లోకి భక్తుల రాకను పునరుద్ధరించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. భక్తుల దర్శనాల కోసం ఆలయాలు తెరిచే విషయమై అర‌ణ్య భ‌వ‌న్ లో మంత్రి దేవాదాయ శాఖ అధికారుల‌తో స‌మీక్షించారు. దేవాలయాల పునః ప్రారంభానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ (ఎస్‌ఓ‌పి)ను అధికారులతో చర్చించారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా క్యూలైన్ల ఏర్పాటు, సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో ఆలయం శుభ్రపరచడం, ప్రవేశ ద్వారం దగ్గర శానిటైజర్‌లు అందుబాటులో ఉంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.
ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జూన్ 8 నుంచి ఆలయ తలుపులు తెర‌వ‌నున్నామని, అయితే కంటైన్మెంట్ జోన్లో ఉన్న ఆల‌యాల్లోకి భ‌క్తుల‌కు ప్రవేశం లేద‌ని స్పష్టం చేశారు. ఆల‌యానికి వ‌చ్చే భక్తులు భౌతిక‌ దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధ‌రించ‌డం తప్పనిసరి అన్నారు. ప్రతి ఒక్కరి శరీర ఉష్ణోగ్రతను పరిశీలించేందుకు థర్మల్ గన్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. శానిటైజర్లతో ప్రత్యేక స్టాండ్లు కూడా ఉంటాయని పేర్కొన్నారు. అన్ని జాగ్రత్తలతో ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తామన్నారు. 

Post Top Ad