రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ ..ప్రజా ఉద్యమం మొదలవ్వాల్సిందే! అంటూ ఆసక్తికర పోస్ట్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 11, 2020

రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ ..ప్రజా ఉద్యమం మొదలవ్వాల్సిందే! అంటూ ఆసక్తికర పోస్ట్

కాంగ్రెస్ పార్టీ నేత, ఫైర్ బ్రాండ్ మల్కాజిగిరి ఎంపీ,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జన్వాడ ఫాంహౌస్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ కు హైకోర్టు స్టే ఇవ్వడంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రభుత్వ అవినీతిని నిలదీస్తున్నందుకు, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు తనను నిర్బంధానికి గురి చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఇక సోషల్ మీడియా వేదికగా స్పందించిన రేవంత్ రెడ్డి స్టే వచ్చినంత మాత్రాన అన్యాయం గెలిచినట్టు కాదన్నారు.
తెలంగాణ రాష్ట్రం నేడు ఖాకీల పహారా మధ్య నలిగిపోతున్నదంటూ వ్యాఖ్యానించారు. నిర్బంధాన్ని ఛేదించడం కోసం స్వేచ్ఛ సంఘర్షిస్తోంది అంటూ ఆయన పేర్కొన్నారు.గాంధీ లో వైద్యుల ఆవేదన వినడానికి వెళ్తానంటే రాజ్యం అనుమతి ఇవ్వనంటోంది అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. యువరాజు ఫాంహౌస్ అక్రమాల విచారణ పై స్టే వచ్చినంత మాత్రాన అన్యాయం గెలిచినట్టు కాదు అని ఆయన పేర్కొన్నారు.
ఇక ప్రజలకు ఈ విషయం అర్థమయ్యేలా చెబుదామంటే మీడియా సమావేశం పెట్టే పరిస్థితి కూడా తెలంగాణలో లేదు అని ఆయన పేర్కొన్నారు. తెలతెల్లవారుతూనే ఇంటి ముందు పోలీసుల కవాతు. హౌస్ అరెస్టులు... ఇక లాభం లేదు ప్రజా ఉద్యమం మొదలవ్వాల్సిందే! అంటూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర చేశారు రేవంత్ రెడ్డి. ఇక ఇదే సమయంలో ఈరోజు రేవంత్ రెడ్డి ని ఇంటి నుండి బయటకు రానివ్వకుండా ఖాకీల పహారా కాస్తున్న నేపధ్యంలో పోలీసులతో ఆయన తనను బయటకు వెళ్లనివ్వమని తనకు పనులు ఉన్నాయి అని, ప్రజలను ఓట్లు వేసే ప్రజాప్రతినిధిగా గెలిపించింది ఇంట్లో కూర్చోడానికి కాదంటూ ఆయన మాట్లాడారు.

Post Top Ad