నర్సరీలో పనిచేసే అర్హులందరికీ కేటీఆర్ భరోసా - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 17, 2020

నర్సరీలో పనిచేసే అర్హులందరికీ కేటీఆర్ భరోసా

ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అడవుల పునరుద్ధరణకు, ఉన్న అడవులను కాపాడుకోవడానికి అందరూ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. అధిక జనాబా, అధిక కాలుష్యం, తక్కువ అడవి ఉండే పట్టణాల్లో పచ్చదనం పెంచాలని స్పష్టం చేసింది. అటు మున్సిపాలిటీలు పచ్చదనానికి కేటాయించిన 10 శాతం నిధులు కూడా వాడుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ శంషాబాద్ లోని హెచ్ఎండీఏ నర్సరీ లో మొక్కలను పరిశీలించారు. హుడా కాలనీ నర్సరీలోని మొక్కలను పరిశీలించి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా నర్సరీలో మొక్కలు పెంచుతున్న తీరు, ఏ మొక్కలు అందుబాటులో ఉన్నాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నర్సరీ లో పని చేస్తున్న కార్మికుల యోగక్షేమాలు, జీతం, ఈఏఎస్ఐ సదుపాయాల గురించి మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ రావడం లేదని వాపోయిన కార్మికులు.. వచ్చే 10 వేల రూపాయల జీతం సరిపోవడం లేదని మంత్రి కేటీఆర్‌కు విన్నవించుకున్నారు. కార్మికుల సమస్యలకు స్పందించిన మంత్రి కేటీఆర్..వారికి భరోసానిచ్చారు. అధికారుల తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు.