వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేట మండలం అమ్రాది కుర్దు గ్రామంలో లో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 12, 2020

వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేట మండలం అమ్రాది కుర్దు గ్రామంలో లో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్...

శుభ తెలంగాణ న్యూస్ (12జూన్20)  వికారాబాద్  MLA డాక్టర్ మెతుకు ఆనంద్ గారు శుక్రవారం మోమిన్ పేట్ మండలం లోని బాల్ రెడ్డి గూడ గ్రామంలో 7 లక్షలతో, అమ్రాది కుర్డు గ్రామంలో 5 లక్షలతో నిర్మించిన CC రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేవెళ్ల MP రంజిత్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్నారు TRS ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం అని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ KCR గారి పిలుపు మేరకు బాల్ రెడ్డి గూడ గ్రామంలో మక్కజొన్నలు పండించము అని గ్రామ రైతులు తీర్మానం చేశారు. MLA గారి, MP గారి సమక్షంలో గ్రామ రైతులు మక్కలు పండించము అని ప్రతిజ్ఞ చేసారు.ఈ కార్యక్రమంలో ZP వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారు, మోమిన్ పేట్ మండల పరిషత్ అద్యక్షురాలు శ్రీమతి వసంత వెంకట్ గారు, స్థానిక సర్పంచులు చంద్రకళ గోవర్ధన్ రెడ్డి (బాల్ రెడ్డి గూడ), సునీత గారు (అమ్రాది కుర్ద్), Pacs చెర్మెన్ అంజిరెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, TRS పార్టీ మండల అధ్యక్షులు నరసింహా రెడ్డి గారు, వైస్ ఎంపీపీ మానస గారు, MPDO గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad