ప్రజల్లో ఉనికికోసమే ప్రతిపక్షాల పాకులాట - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 24, 2020

ప్రజల్లో ఉనికికోసమే ప్రతిపక్షాల పాకులాట

ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతున్నదని, ప్రజలు సీఎం కేసీఆర్‌ను వ్యవసాయ సంస్కర్తగా కీర్తిస్తున్నారని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ క్యాంప్‌ కార్యాలయం, పాములపర్తిలో మంగళవారం వేర్వేరుగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొండపోచమ్మసాగర్‌ ద్వారా 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు అందుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ సూచనలతో తొలిదశలో బుధవారం జగదేవ్‌పూర్‌ కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నటు ్ల తెలిపారు. ఈ కాలువ ద్వారా గజ్వేల్‌, అలేరు నియోజకవర్గాలకు చెందిన 42 చెరువులు కుంటలు గోదావరి జలాలతో నిండనున్నాయని అన్నారు. వ్యవసాయంలో సంస్కరణలను అమలు చేసి సీఎం కేసీఆర్‌ రైతాంగం మెప్పు పొందారని పేర్కొన్నారు. దీనిని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ఉనికికోసం పాకులాడుతున్నాయని ఎద్దేవా చేశారు. 70 ఏండ్లు పాలించిన పార్టీలు రాష్ట్రరైతాంగానికి చేసిందేమీ లేదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాన్ని ఆర్థికంగా ఏవిధంగానూ ఆదుకోవడంలేదని.. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులను రాష్ట్రప్రభుత్వమే ప్రణాళిక ప్రకారం రూపొందించిందని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ నేనున్నానని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్నదని ఎద్దేవాచేశారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్‌, జెడ్పీటీసీ మల్లేశం, మర్కూక్‌ ఎంపీపీ పాండుగౌడ్‌ పాల్గొన్నారు.