సిటీ బస్సులకు అనుమతిపై కేసీఆర్ కీలక నిర్ణయం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 10, 2020

సిటీ బస్సులకు అనుమతిపై కేసీఆర్ కీలక నిర్ణయం

హైదరాబాద్‌లో సిటీ బస్సులను నడపడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు విపరీతంగా నమోదు అవుతుండడంతో ప్రస్తుతానికి బస్సులను నడపవద్దని నిర్ణయించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రగతిభవన్‌లో ఆర్టీసీపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఐదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహా, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరోవైపు, అంతర్రాష్ట్ర సర్వీసులపై ఒప్పందం చేసుకోవాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. దీనిపై ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం హైదరాబాద్ కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుస్తున్న సంగతి తెలిసిందే. కానీ, కరోనా కేసులు రాజధాని పరిధిలో ఎక్కువగా నమోదు అవుతుండడంపై సిటీ బస్సులకు అప్పుడు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా కరోనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో బస్సులను నడపవద్దని నిర్ణయించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తో పాటు, ఎండీ సునీల్‌ శర్మ, ఇతర ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Post Top Ad