కరోనాతో జర్నలిస్టు మృతి - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, June 07, 2020

కరోనాతో జర్నలిస్టు మృతి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి, తెలుగు జర్నలిస్టుని బలి తీసుకుంది. హైదరాబాద్ లో జర్నలిస్టుగా పని చేస్తున్న మనోజ్ కరోనాతో మృతి చెందారు. కరోనా సోకడంతో 4 రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో చేరిన మనోజ్ చికిత్స పొందుతూ ఇవాళ(జూన్ 7,2020) తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. కాగా మనోజ్ ఇతర ఆరోగ్య సమస్యలతో(మయస్తినీయా గ్రేవీస్ తో-Myasthenia gravis) బాధపడుతున్నట్టు డాక్టర్ రాజారావు చెప్పారు. ఇదే సమయంలో ఆయనకు కరోనా సోకింది. మనోజ్ మృతి పట్ల జర్నలిస్టు సంఘాలు సంతాపం తెలిపాయి. మనోజ్.. టీవీ 5 న్యూస్ చానల్ లో క్రైమ్ రిపోర్టర్.

Post Top Ad