జీతాల కోతలపై నో క్వశ్చన్ .. ఉద్యోగులు,పెన్షనర్లకు షాకిస్తూ తెలంగాణా ప్రభుత్వ ఆర్డినెన్స్ !! - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 17, 2020

జీతాల కోతలపై నో క్వశ్చన్ .. ఉద్యోగులు,పెన్షనర్లకు షాకిస్తూ తెలంగాణా ప్రభుత్వ ఆర్డినెన్స్ !!

తెలంగాణా సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు ,పెన్షనర్ లకు షాక్ ఇచ్చింది .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల జీతాలలో తెలంగాణ ప్రభుత్వం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో కోత విధించిన విషయం తెలిసిందే. మరికొన్ని నెలల పాటు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు సగం జీతాలు, పెన్షనర్లకు 75% చెల్లింపులు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక దీనిపై ఉద్యోగులు, పెన్షనర్లు కోర్టు మెట్లు ఎక్కి ఇబ్బంది పెట్టకుండా తెలంగాణ ప్రభుత్వం రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ ను సిద్ధం చేసి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల చెల్లింపుల విషయంలో ఆర్డినెన్స్ తీసుకువచ్చింది.
విపత్తులు వంటి అత్యయిక పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లకు పింఛన్లలో కోత విధించే నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉండేలా ఆర్డినెన్స్ తీసుకువచ్చింది టీ సర్కార్ .ఇక అంతే కాదు ప్రస్తుతం ఈ ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం కూడా పొంది జారీ అయింది. ఇక మార్చి 24 వ తేదీ నుండి ఇది అమల్లోకి వచ్చినట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది.
తెలంగాణ విపత్తులు ప్రజారోగ్య ,అత్యయిక ఆర్డినెన్సు 2020కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ లో ప్రభుత్వరంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల కు చేసే చెల్లింపుల్లో 50 శాతం కోత విధించేలా ఆర్డినెన్స్ రూపొందించింది. ఇక కోత విధించిన మొత్తాన్ని ఆరు నెలలలో ఉద్యోగులు, పెన్షనర్లకు తిరిగి చెల్లించాలని పేర్కొంది.
రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లను తగ్గించడంతో కొంత మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ జరుపుతున్న సమయంలో.. పెన్షన్లను తగ్గించడానికి ప్రభుత్వానికి ఉన్న అధికారాలేమిటో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు వచ్చిన ఒక్క రోజులోనే ప్రభుత్వం అలాంటి అధికారాలు తమకు ఉన్నాయని తెలియజేసుకుంటూ ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. దీంతో కోర్టు ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టయ్యింది .
కేసీఆర్ సర్కార్ తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం.. విపత్తుల సమయంలో జీతాలు, పెన్షన్లు తగ్గించి ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. న్యాయస్థానాలు తమను ప్రశ్నించకుండా నే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఆ ఆర్డినెన్స్ ప్రకారం సర్కార్ మరి కొన్ని నెలల పాటు ఉద్యోగులకు , పెన్షనర్లకు జీతాల కోత విధించి ఇబ్బంది పెడుతుందేమో అన్న షాక్ లో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు .