చైనా వస్తువులు, యాప్‌లు, తదితరాలను భారతదేశంలో వినియోగించొద్దు... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 19, 2020

చైనా వస్తువులు, యాప్‌లు, తదితరాలను భారతదేశంలో వినియోగించొద్దు...

భారత్‌, చైనా మధ్య జరిగిన ఘర్షణలో ఇండియాకు చెందిన జవాన్లు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. దీంతో చైనా వస్తువులు, యాప్‌లు, తదితరాలను భారతదేశంలో వినియోగించొద్దని ప్రజలు నినాదం చేస్తున్నారు. సోషల్‌మీడియాలో వీడియోలు, సందేశాలు పోస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనరల్‌ మర్చంట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వ్యాపారులు శుక్రవారం పట్టణంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు చైనా వస్తువులను ధ్వంసం చేసి ‘బ్యాన్‌ చైనా ప్రోడక్స్ట్‌’ అంటూ నినాదాలు చేశారు. ఆ సంఘం అధ్యక్షుడు శ్రీరాం వ్యాస్‌ మాట్లాడుతూ భవిష్యత్‌లో తాము భారతదేశంలో తయారైన వస్తువులను మాత్రమే తమ దుకాణాల్లో విక్రయిస్తామని, చైనా వస్తువులను బ్యాన్‌ చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ 800 మంది వ్యాపారులు ఉన్నారని వారంతా అసోసియేషన్‌ తీసుకున్న ఉమ్మడి నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. సమృద్ధి గల భారతదేశంలో జీవిస్తున్నామని తాము కూడా ఈ దేశానికి సహకరిస్తామని తెలిపారు.