జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు కేసీఆర్ మర్చిపోయారు.. దీక్ష చేస్తున్న జర్నలిస్టులకు మద్దత్తు తెలిపిన రేవంత్ రెడ్డి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, June 14, 2020

జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు కేసీఆర్ మర్చిపోయారు.. దీక్ష చేస్తున్న జర్నలిస్టులకు మద్దత్తు తెలిపిన రేవంత్ రెడ్డి..

విధిలేని పరిస్థితిలో జర్నలిస్టులు తమ విధులను నిర్వహిస్తున్నారని, అయినప్పటికి ప్రభుత్వం జర్నలిస్టుల మీద కఠినంగా వ్యవహరిస్తోందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలకోసం ఒకరోజు ఉపావాస దీక్షను తలపెట్టింది తెలంగాణ జర్నలిస్టుల ఫోరం. ఈ నేపథ్యలో జర్నలిస్టుల ఉపవాస దీక్షకు మద్దతు తెలిపిన రేవంత్ రెడ్డి తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం మర్చిపోయందని అన్నారు.విధులను కాదని ముందుకు వచ్చి దీక్ష చేస్తున్నరంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందనే అంశం అర్ధమవుతోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ జర్నలిస్టులను ప్రభ్యత్వం భేషరతుగా ముందుకు వచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉందని, 15 వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి పెరిగిన సందర్బంలో జర్నలిస్టుల సంక్షేమాన్ని ఎందుకు మరిచిందని ప్రశ్నించారు. దాదాపు నాలుగు లక్షల రూపాయలు కరోనా పేషంట్స్ కోసం ఖర్చు పెడుతున్నామని చెప్తున్న ప్రభుత్వం, మృతి చెందిన మనోజ్ కుటుంబానికి ఎంత నష్టపరిహారం ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేసారు.