రేపు బాబ్లీ గేట్లు ఎత్తివేత - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 30, 2020

రేపు బాబ్లీ గేట్లు ఎత్తివేత

మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు బుధవారం తెరుచుకోనున్నాయి. కేంద్ర జల వనరుల శాఖ అధికారుల సమక్షంలో ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి ఏడాది జూలై 1 నుంచి అక్టోబర్‌ 28 వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తి ఉంచాల్సి ఉంటుంది. బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తడం ద్వారా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందనున్నది.