వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండల సభకు హాజరైన ఎంపీపీ, ఎంపీడీవో ఎమ్మార్వో.... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 09, 2020

వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండల సభకు హాజరైన ఎంపీపీ, ఎంపీడీవో ఎమ్మార్వో....

శుభ తెలంగాణ న్యూస్ :వికారాబాద్ జిల్లా ప్రతి మూడు నెలలకోసారి జరగవలసిన మోమిన్ పేట మండల సర్వసభ్య సమావేశం ప్రకటించిన సమయానికి ఎంపీపీ ఎంపీడీవో తాసిల్దార్ హాజరైనప్పటికీ సర్పంచులు ఎంపీటీసీలు హాజరు కాలేకపోయారు మంగళవారం  మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు నిర్ణయించిన సమయానికి ఎంపీపీ వసంత వెంకట్ ఎంపీడీవో శైలజ రెడ్డి తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి సకాలంలో హాజరయ్యారు మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులు సైతం అదే ఖాళీ లేకపోవడంతో ఎంపీటీసీలు జడ్పీటీసీ తోపాటు మండలంలోని సర్పంచులు పీఏసీఎస్ చైర్మన్లు హాజరు కాకపోవడంతో మండల సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీపీ వసంతం వెంకటేష్ ప్రకటించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సభ్యులందరూ మండల స్థాయి అధికారులు సకాలంలో హాజరై మండల సభలు జయప్రదం చేయాలని వారు సూచించారు ప్రస్తుతం ఉన్న భయం కారణంగా సభ్యులు ఎవరు  హాజరు కాకపోవచ్చని అధికారులు ప్రజా ప్రతినిధులు పేర్కొంటున్నారు ఈసారి నిర్వహించే సమావేశానికి సభ్యులందరూ మాస్కులు ధరించి సమావేశ మందిరంలో సామాజిక దూరం పాటించి మండల సభ లో లో విధిగా పాల్గొనాలని వారు సూచించారు సకాలంలో సభలకు హాజరు కాని సభ్యులపై చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు

Post Top Ad