ఆకుపచ్చ తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్‌గూడ ప్రధాన రహదారిపై నిర్వహించిన హరితహరం కార్యక్రమంలో మంత్రి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పాల్గొన్ని మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నహరితహారంతో నేడు పల్లెలు, పట్టణాలు ఆకుపచ్చగా మారాయని అన్నారు. ప్రతి ఒక్కరు హరిహారంలో మొక్కలు నాటాలని, వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటించాలన్నారు.
Post Top Ad
Tuesday, June 02, 2020
ఆకుపచ్చ తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం
Admin Details
Subha Telangana News