ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడూ కాదు.. అందరి భాగస్వామ్యంతోనే ఆదర్శ గ్రామాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 17, 2020

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడూ కాదు.. అందరి భాగస్వామ్యంతోనే ఆదర్శ గ్రామాలు

పల్లె తల్లిని కాపాడుకొంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.  అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారాలు, కావాల్సినంతమంది అధికారులు, స్పష్టమైన విధానాలు, పాలనా సౌలభ్యంగా గ్రామాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలోని పల్లెలన్నీ బాగుపడితీరాలని స్పష్టంచేశారు. ఇన్ని అనుకూలతలున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాకపోతే, ఇంకెప్పుడూ గ్రామాలు బాగుపడవని సీఎం అభిప్రాయపడ్డారు. మంత్రులు,  ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో మంగళవారం సమావేశమయ్యారు. గ్రామాభివృద్ధి  ప్రణాళిక, ఉపాధిహామీ పథకం, హరితహారం, అడవుల పునరుద్ధరణ, పల్లెప్రగతి,  గ్రామాల్లో పచ్చదనం.. పరిశుభ్రత, రైతుబంధు,  రైతువేదికల నిర్మాణం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌సెజ్‌ల ఏర్పాటు, కరోనా,  అంటువ్యాధులు, మిడతల దండు, నకిలీ విత్తనాలు, కరెంటు బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. 
వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు, గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పనకు, అవసరమైన పనులుచేసుకోవడానికి ఉపాధి హామీ పథకాన్ని (నరేగా) వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని సీఎం చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రైతుల భూముల్లో లక్ష కల్ల్లాలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు.  ప్రతి గ్రామం ప్రతిరోజు శుభ్రం కావాల్సిందేనని, ముఖ్యమంత్రితో సహా రాష్ట్రంలో అధికార యంత్రాంగంలో ఎవరికైనా సరే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి మించిన పని మరొకటిలేదని స్పష్టంచేశారు. రాబోయే రెండు నెలల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం, నాలుగు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తికావాలన్నారు. రాబోయే నాలుగేండ్లలో ఏ గ్రామంలో ఏ పనిచేయాలనే విషయంలో ప్రణాళికలు రూపొందించాలని, దానికి అనుగుణంగానే పనులుచేయాలని, ఈ వివరాలతో డిస్ట్రిక్ట్‌ కార్డు తయారుచేయాలని సీఎం చెప్పారు. గ్రామాల్లో కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో జరుగాల్సిన పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శనం చేశారు. సమావేశంలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

Post Top Ad