మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 09, 2020

మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలి

జిల్లాలో మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూమ్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని  దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, తహసీల్దార్లతో మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూమ్ పనుల పురోగతిపై నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని సమీక్షించారు. మిషన్ భగీరథ పథకం కింద ఇప్పటివరకు ఎన్ని ఆవాసాలకు బల్క్ నీరు అందించారు. ఎన్ని గ్రామాల్లో పైప్ లైన్ పనులు పూర్తి అయినవి, ఎన్ని ఆవాసాలకు పూర్తిగా నీరు సరఫరా చేస్తున్న వివరాలను మండలాల వారీగా సమీక్షించారు.
మిషన్ భగీరథ ఎస్ఈ మాట్లాడుతూ జిల్లాలోని 710 ఆవాసాల్లో 693 ఆవాసాలకు బల్క్  నీరు సరఫరా చేస్తున్నామని నిర్మల్ నియోజకవర్గం లో 212 ఆవాసాలు, ముధోల్ నియోజకవర్గం లో 262, ఖానాపూర్ నియోజకవర్గం లోని 212 ఆవాసాలకు బల్క్ నీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాల పై మండలాల వారీగా సమీక్షించారు. మండలాల వారీగా కేటాయించిన డబుల్ బెడ్ రూం గృహాల సంఖ్య, నిర్మాణాల కు కావాల్సిన స్థల సేకరణ, ఇప్పటివరకు నిర్మించిన గృహాలపై సమీక్షించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Post Top Ad